🏥 కెనడాలో Health Card ఎలా Apply చేయాలి? – సొంత అనుభవంతో (తెలుగులో) హాయ్ ఫ్రెండ్స్!
కెనడా హెల్త్ కార్డ్ ఎలా అప్లై చేయాలి? (Ontario ప్రావిన్స్) కెనడాలో పనిచేయాలంటే లేదా హాస్పిటల్ సర్వీసులు పొందాలంటే తప్పనిసరిగా హెల్త్ కార్డ్ అవసరం. మీరు కెనడాకు రాగానే address proof confirm అయిన తర్వాత మీరు హెల్త్ కార్డ్ అప్లై చేయాలి. ఈ పోస్ట్ ద్వారా నేను నా అనుభవాన్ని సులభమైన భాషలో తెలుపుతున్నాను. 📌 మొదటగా: ఎలా అప్లై చేయాలి? Google లో “Ontario Health Card Apply” అని టైప్ చేయండి. Service Ontario అనే మొదటి లింక్‌ను ఓపెన్ చేయండి. 👉 హెల్త్ కార్డ్ అప్లై చేయండి అక్కడ “How to apply” సెక్షన్‌కి వెళ్లండి. అక్కడ మీరు అవసరమైన డాక్యుమెంట్ల లిస్టు చూడవచ్చు. 📄 అవసరమైన డాక్యుమెంట్లు: 📌 Canada Status proof: Work Permit / Study Permit (ఇమ్మిగ్రేషన్ సమయంలో ఇచ్చినది) 📌 Identity proof: మీ Passport 📌 Address proof: Rental Agreement, లేదా మీ పేరుతో ఏదైనా Bill (Hydro/Mobile/Internet) 👨👩👧👦 మా కుటుంబ అనుభవం: మేము ఐదుగురం (నేను, భార్య, ముగ్గురు పిల్లలు) అప్లై చేయడానికి వెళ్ళాం. కానీ మా భార్య పేరుతో address proof లేకప...